Monday, December 23, 2024

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కు

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా

కరీంనగర్ ప్రతినిధి: వయోవృద్ధులు, దివ్యంగులు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకొనుటకు నిబంధనల మేరకు ఎన్నికల కమీషన్ అను మతించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మ పురి శాసన సభ నియోజక వర్గాలలో 6,87,952 మంది ఓటర్లు కాగా, ఇందులో 12,077 మంది వయోవృద్దులు, 32,342 మంది దివ్యాంగులు ఉన్నారని తెలిపారు.

ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం ఇలాంటి వారికి ఇంటి వద్ద నుండే ఓటు హక్కు కల్పించడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం జరుగుతున్నదని కలెక్టర్ వివరించారు. ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునే 80 ఏళ్లకు పై గల వయోవృద్దులు, 40 శాతం కన్నా మించి ఉన్న దివ్యాంగులు ఓటరు జాబితాలో ఓటరుగా నమోదైన వారు ఫారం-12 డి లో తమ పూర్తి వివరాలను నమోదు చేసి నవంబర్ 7 వ తేదీలోగా ఆయా బూత్ స్థాయి అధికారులకు అందజేయాల్సి ఉంటుందని, అలా ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికే ఇంటివద్ద నుండి ఓటు హక్కు వినియోగించుకునే వేసులుబాటును ఆయా సంబంధిత రిటర్నింగ్ అధికారులు కల్పిస్తారని తెలిపారు.

పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటానని తెలిపిన వారికి ఫారం-12 డి ఇవ్వరని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల సౌకర్యం కోసం ర్యాంపులు, వయోవృద్దుల కోసం వీల్ చైర్స్, వాకింగ్ స్టిక్స్ లతో పాటు అటెండర్ ను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఫారం-12 డి ద్వారా ఇంటి వద్ద నుండి ఓటు హక్కు వినియోగించుకునే వారి వద్దకు ముందురోజే పోలింగ్ అధికారులు, వీడియో గ్రాఫర్, పోలీసులతో వెళ్లడం జరుగుతుందని తెలిపారు.

ఆయా వారు ఓటు హక్కు వినియోగించు కునేందుకు ఎన్నికల అధికారులు కంపార్టుమెంట్ ను ఏర్పాటు చేస్తారని, సదరు ఓటర్లు రహస్యంగా ఓటు హక్కు వినియోగించుకుని బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ అంతా వీడియో కవరేజి చేయడం జరుగుతుందన్నారు. ఒకవేళ మొదటి రోజు ఓటు హక్కు వినియోగించుకోని పక్షంలో మరొక సారి ఓటు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తారని, ఇలా రెండు సార్లు మాత్రమే వీలు కల్పించడం జరుగుతుందని వివరించారు. జిల్లాలోని అర్హత గల వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News