Saturday, February 22, 2025

ఓటు హక్కు చాలా విలువైంది

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి : ఓటు హక్కు చాలా విలువైనదని, అంద రూ ఓటు హక్కు కలిగి ఉండాలని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్లు, బీఎల్‌ఓల ను ఆదేశించారు. బుధవారం అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ 80 పరిధిలోని అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో అలంపూర్ , ఉండవల్లి, వడ్డేపల్లి, రాజోలి, అయిజ, మానవపాడు, ఇటిక్యాల మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీటీలు, సూపర్‌వైజర్లు, బిఎల్‌ఓలకు ఎస్‌ఎస్‌ఆర్ 2023లో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ శిభిరంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న ఎన్నికల ఓటర్ లిస్ట్ డ్రాప్ట్ విడుదల చేయడం జరిగిందని దానిలో ఉన్న ఓటర్ల పూర్తి వివరాలు తెలుసుకొని మార్పులు చేర్పులు ఉంటే బిఎల్‌ఓలు చెక్ చేయాలన్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో విఐపి ఓట్లు ఎన్ని ఉన్నాయో చూడాల న్నారు. అలాగే డబుల్ ఓటర్లు డూప్లికేట్ ఓటర్లు లేకుండా చెక్ చేసుకోవాలన్నారు.

గృహ లక్ష్మీ పథక ంకి వచ్చిన దరఖాస్తులను ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చీర్ల శ్రీనివాస్, అపూర్వ చౌహన్ , ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీటీలు, సూపర్‌వైజర్లు, బిఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News