Monday, January 20, 2025

విద్యుత్ డిమాండ్ @15031 మెగావాట్లు

- Advertisement -
- Advertisement -

డిమాండ్ తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్టా విద్యుత్ డిమాండ్ కూడా అంతకు అంత పెరుగుతోంది గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రాష్ట్రములో జనవరి నెలలో 6.9 శాతం, ఫిబ్రవరి నెలలో 4.6 శాతం అధిక వినియోగం. అలాగే ఫిబ్రవరి 2023 లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 14649 మెగావాట్లు ఉండగా ఫిబ్రవరి 2024 లో 15031 మెగావాట్లు (2024 ఫిబ్రవరి 23 వ తేదీ వరకు) గా నమోదయ్యింది. 23.02.2024 న గరిష్ట డిమాండ్ 15031 మెవాట్లు ఈ నెల 23న 14526 మెగావాట్లు విద్యుత్ డిమాండ్ పెరిగింది.

ఈ నెలాఖరు వరకు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారుల అభిప్రాయ పడుతున్నారు. గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో సరాసరి విద్యుత్ వినియోగం 242.95 మిలియన్ యూనిట్లు ఉండగా అది ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నాటికి 256.74 మిలియన్ యూనిట్ల కు చేరింది. అలాగే దక్షిణ డిస్కంలో, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రాష్ట్రము లో జనవరి నెలలో 6.67 శాతం, ఫిబ్రవరి నెలలో 6.24 శాతం అధిక వినియోగం నమోదైంది. ఫిబ్రవరి 2023 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 9043 మెగావాట్లు ఉండగా 2024 ఫిబ్రవరి 23 వ తేదీ వరకు 9253 మెగావాట్లు గా నమోదైంది.

గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో సరాసరి విద్యుత్ వినియోగం 158.71 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నాటికి 169.36 మిలియన్ యూనిట్ల కు చేరింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరి నెలలో 9.47% శాతం, ఫిబ్రవరి నెలలో 12.27% అధిక వినియోగం నమోదు. ఫిబ్రవరి 2023 లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2930 మెగావాట్లు ఉండగా 2024 ఫిబ్రవరి 23 వ తేదీ వరకు 3174 మెగావాట్లు గా నమోదైంది. జనవరి, ఫిబ్రవరి 2023 లో సరాసరి విద్యుత్ వినియోగం 51.69 మిలియన్ యూనిట్లు ఉండగా ,ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నాటికి 57.34 మిలియన్ యూనిట్ల కు చేరింది. ఈ ఫిబ్రవరిలో 65 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News