Monday, December 23, 2024

ఓటరు జాబితా రూపకల్పనలో బిఎల్‌ఓల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ లెవల్ ఆఫీసర్ల పాత్ర కీలకమని, ఏ ఒక్క ఓటరు కూడా ఓటు లేకుండా ఉండొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బిఎల్ఓలను ఆదేశించారు. శనివారం భువనగిరి మండలానికి సంబంధించి బూత్ లెవల్ అధికారులు, సూపర్వైజర్లకు జరిగిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ లెవల్ అధికారుల పాత్ర చాలా కీలకమని, బూత్ లెవల్ ఆఫీసర్లు 6, 7, 8 ఫారములపై, బిఎల్‌ఓ యాప్ వినియోగంపై స్పష్టమైన అవగాహన పొందాలని అన్నారు.

ఏ ఒక్క ఓటరు కూడా ఓటు లేకుండా ఉండొద్దని, వంద శాతం ఓటరు నమోదు చేయాలని, డూప్లికేట్ ఓటర్లు అనే పదం ఉండొద్దని, అ ందుకోసం క్రాస్ చెక్ చేసుకోవాలని తెలిపారు. ఇంటింటి సర్వేలో ఫారమ్ 6,7,8 లలో కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, సవరణలు, నియోజక వర్గ మార్పులపై పరిశీలించి ఓటరు వివరాలు యాప్లో పక్కాగా న మోదు చేయాలని,ఇంటి నెంబర్లు సరిగా వేయాలని,18 సంవత్సరాలు ని ండిన వారి వివరాలను తప్పనిసరిగా అడగాలని, తొలగించిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధ్రువీకరించుకోవాలని,ఒకే ఇంట్లో ఆరు కన్నా అధికంగా ఉన్న ఓట్ల వివరాలు ధ్రువీకరించుకోవాలని తెలిపారు.

బూత్ లెవల్ ఆఫీసర్స్ నేషనల్ ఓటర్ సర్వీసు పోర్టల్ వివరాలను కూడా పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు రిజిష్టర్ సరిగా నిర్వహించాలని, 1 నుండి 9 వరకు ఉండే స్టేట్మెంట్లు సరిగా పూర్తి చేయాలని,పోలింగ్ కేంద్రాలలో వసతులను పరిశీలించి నమోదు చేయాలని, దివ్యాంగ ఓటర్లకు, వృద్ధులకు ర్యాంపులు ఉండేలా చూడాలని,రెండవ విడుత ప్రత్యేక ఓటరు సవరణ జాబితా కార్యక్రమాన్ని పకడ్బందీగా రూపొందించాలని ఆమె ఆదేశించారు.శిక్షణా కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్ రెడ్డి, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్ కే.నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News