Tuesday, November 5, 2024

నేరాల అదుపునకు సీసీ కెమెరాల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, దీంతో నేరాలను కట్టడి చేయవచ్చని భువనగిరిఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి మండలంలోని ముస్తాలపల్లి గ్రామంలో ప్రధాన వీధులు, చౌరస్తాల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహాకారంతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను భువనగిరి రూరల్ ఎస్‌ఐ దిలీప్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. భువనగిరి మండలం తోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News