Saturday, November 23, 2024

సామాజికోద్యమాల్లో గౌడుల పాత్ర అనిర్వచనీయం

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్రాధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ రచించిన ‘ సామాజిక ఉద్యమాల్లో గౌడుల చరిత్ర ’ పుస్తకాన్ని రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న 373వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంలు తమ చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించి అంబాల నారాయణగౌడ్‌ను అభినందించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సామాజికోద్యమాల్లో గౌడ్‌ల పాత్ర అనిర్వచనీయమైనదని అన్నారు.

సర్వాయి పాపన్న కాలం నుంచే సబ్బండ వర్ణాలను కలుపుకొని స్వయం పాలన కోసం ప్రాణాలు విడిచిన గౌడ వీరులు ఎంతో మంది ఉన్నారని అన్నారు. కడుపు కాలి కత్తిపట్టిన వీరుల చరిత్రను నేటితరం యువతకు తెలియాలంటే ఇటువంటి పుస్తకాలు మరెన్నో రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, సభ్యులు కిషోర్ గౌడ్, రాష్ట్ర క్రీడా కార్పొరేషన్ చైర్మన్ డా.ఆంజినేయగౌడ్, మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, కల్లు గీత సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్, గీత పనివార సంఘం జాతీయ అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్‌గౌడ్, ఎంవి. రమణ, అయిలి వెంకన్నగౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, కొప్పుల రవీందర్‌గౌడ్, పచ్చిమడ్ల మానస, బైరి మహేందర్‌గౌడ్, మాలెల బాలక్రిష్ణగౌడ్, విక్రం గౌడ్ తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News