Wednesday, January 22, 2025

సమాజంలో జర్నలిస్టులది ప్రతిపక్ష పాత్ర

- Advertisement -
- Advertisement -

ప్రజా సమస్యలు వెలికి తీసి పరిష్కారింపజేయడం వారికే సాధ్యం: సిఎం రేవంత్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని,రాజకీయ నాయకులు మోర్ పవర్ అంటే జర్నలిస్టులు మోర్ ఫ్రీడమ్ అంటారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కార ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలు వెలికి తెచ్చి పరిష్కరింపజేయడం జర్నలిస్టులకే సాధ్యమని, పరిపాలనలో అనుభవజ్ఞులు సూచనలు తీసుకుని మా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.

వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర తగ్గుతోందని, ఇది మనకు ప్రమాదకరమైన పరిణామని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని, తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీపై ప్రభావితం చేసే వారిని ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, , పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News