Monday, January 20, 2025

సమాజాన్ని చైతన్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : సమాజాన్ని చైతన్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం గృహాలకు పట్టాలను పంపిణీ చేశారు. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి దయాకర్‌రావు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అమోఘమైందని, జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో జర్నలిస్టులు ఒకరికొకరు పోటీపడుతూ వార్తలను సేకరిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. సమాజాన్ని చైతన్యపర్చడంలో మీడియా జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదన్నారు.

సత్యానికి దూరం ఉండకుండా నిజాలను మాత్రమే ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం జర్నలిస్టు యూనియన్ ఐజేయూ జాతీయ కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎంతో కృషి చేస్తున్నారని, సమాజంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి జర్నలిస్టులు కృషి చేయాలే కాని నాయకులపై బురదజల్లే వార్తలు రాయకుండా మంచి వార్తలు రాయాలన్నారు. టీడూబ్లజే 143 రాష్ట్ర నాయకులు లెనిన్, గాడిపెల్లి మధు మాట్లాడుతూ జర్నలిస్టుల చిరకాల కోరికైన ఇళ్ల పట్టాలు, ఇండ్ల స్థలాలకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మంత్రి దయాకర్‌రావును జర్నలిస్టు సంఘం నాయకులు, జర్నలిస్టులు గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీ ప్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్, జర్నలిస్టు జాతీయ నాయకులు దూలం శ్రీనివాస్‌గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగపురి అశోక్‌గౌడ్, జలగం శేఖర్, దేవరకొండ కృష్ణప్రసాద్, తీగల కృష్ణారెడ్డి, మేరుగు రమేశ్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, నాయకులు లింగాల వేంకటనారాయణగౌడ్, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News