Tuesday, November 5, 2024

ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్టు నెట్ వర్క్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేక్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మల్లెపల్లి లక్ష్మయ్య, డీఎస్పీ విష్ణు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఉద్యోగులు ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతున్నారన్నారు .

అంబేద్కర్ చెప్పిన సూచనలు కొంత మంది మాత్రమే పాటిస్తున్నారన్నారు. ఒకప్పుడు జర్నలిజంకు ఇప్పటి జర్నలిజం వేరు చాలా మారిందన్నారు. పోటి ప్రపంచంలో దళిత జర్నలిస్టులు నిలదోక్కుకోవడానికి ఈ ఐడిజెఎన్ పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు దేశంలో ఎ క్కడా లేదన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభించి మొదట దళితులను ఉద్దేశించి మాత్రమే తర్వాత అందరికి ఇవ్వడం జరుగుతుందన్నారు. దళిత బందు పథకం కూడా అదే తరహాలో ముందు దళితులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ దపాలో అన్నినియోజక వర్గాల్లో దళిత జర్నలిస్టులకు దళిత బందు ఇస్తామన్నారు. హైరాబాద్ నడిబోడ్డున 152 అడుగుల అంబేద్క్‌ర్ విగ్రహారం పెడితే దేశం గర్వపడిందని ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మెన్న వచ్చిన నీట్ ఫలితాల్లో ఎస్సీ ఎస్టీల రిజర్ట్‌లు అద్భుతమన్నారు.

తెలంగాణ తరహా ఎస్సీఎస్టి ఇతర రాష్ట్రాల్లో కావాలని కోట్లాడుతున్నారన్నారు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికి గురుకులాలు లేవన్నాని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో దేవాలయాలకు దళితులను రానించే పరిస్థ్ధితి లేదన్నారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో ప్రథమ స్ధానంలో తెలంగాణ ఉందన్నారు. దళిత జాతి కోసం పని చేసే విధంగా దళిత జర్నలిస్టులు పని చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర జర్నలిస్టు అద్యక్షుడు అల్లం నారాయణ, మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న హింస దోపిడి అంటరానితనం అన్ని కడుపులో ఉంచుకొని సంయమనంతో నిర్మాణాత్మకంగా ఉంటారన్నారు. సమస్యలపై చర్చ డైలాగ్ ఉండాలి మనుషులు మారారు అనేది ఉండదన్నారు.

దళిత జర్నలిస్టులు వృత్తి పరంగా నిపుణత నైపుణ్యత పెంపొందించుకోవాలన్నారు. మీడియా ఆడాడమీ ఎల్లవేళల మీతో ఉంటుదన్నారు. ఐడిజెన్ కింద అందరం కలిసి పని చేద్దామని ఇది ఒక గొడుగు లాంటిదన్నారు. సమాజం హితం కోసం పని చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్లూజెఎఫ్ జిల్లా అద్యక్షుడు రాజలింగం, నాయకులు జనార్ధన్, చంద్రం, ప్రభుదాసు, వెంకటేశ్, నర్సింలు, ప్రసాద్, ఎల్లం, కిరణ్, అరుణ్, నాగరాజు, జంగయ్య, సాయిలు, శ్రీరాములు, ప్రేమ్‌కుమార్, వెంకటస్వామి, కర్ణాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News