Wednesday, January 22, 2025

గణాంకాల ఖచ్చితత్వంలో మండల అధికారుల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: గ్రామస్థాయి నుండి గణాంకాలు ఖచ్చితంగా రూపొందించడంలో మండల గణాంకాధికారుల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల నోబిస్ 130వ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ గణాంక దినోత్సవం పురస్కరించుకొని గురువారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రణాళిక శాఖ ఆద్వర్యంలో రూపొందించిన 2021.22 జిల్లా గణాంక దర్శిని (హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్)ను జిల్లా అధనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) బి రాహుల్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి సత్యంతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి ఖచ్చితమైన గణాంకాలు రూపొందించి జిల్లా అదికారులకు అందించడంలో మండల గణాంక అధికారుల పాత్ర కీలకమైందని అన్నారు. జిల్లా గణాంక దర్శిని పుస్తకం జిల్లా ఆర్దిక స్ధితిగతులను తెలియజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ గణాంక అధికారులు, మండల ప్రణాళిక అధికారులు, సంబంధిత శాఖల అదికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News