Monday, December 23, 2024

స్వరాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

మక్తల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలిన అమరవీరుల త్యాగాలకు గుర్తుగా మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద త్వరలోనే అమరవీరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం మక్తల్ మున్సిపల్ కార్యాలయం వద్ద తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర కీలకమైందన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది యువకులు, విద్యార్థులు, పౌరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమించారన్నారు.

అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సిద్ధించి 10ఏళ్లు గడుస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన ప్రతి ఒక్క అమరుడిని తెలంగాణ సమాజం జీవితాంతం గుర్తు పెట్టుకుంటుందన్నారు.

అమరుల త్యాగాలను అవమానించడమే..
మక్తల్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన తెలంగాణ అమరవీరుల దినోత్సవానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో పాటు వైస్ ఛైర్‌పర్సన్, పలువురు కౌన్సిలర్లు గైర్హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే చిట్టెం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి డుమ్మా కొట్టడమంటే అమరుల త్యాగాలను అవమానించడమే అని ఆయన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు చీరాల సత్యనారాయణ, మొగులప్ప, జగ్గలి రాములు, గోలపల్లి శంకరమ్మ, ఇర్ఫాన సుల్తానా, ఆనంపల్లి కొండయ్య, కో ఆప్షన్ సభ్యులు శంషుద్దీన్, బిఆర్‌ఎస్ నాయకులు మహిపాల్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News