Friday, November 22, 2024

విపత్తుల సమయంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -
  • 5వరకు విపత్తుల నుండి రక్షణపై అవగాహన
  • సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

సంగారెడ్డి: విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో విపత్తులు సంభవిచినపుడు ఎన్‌డిఆర్‌ఎఫ్ ఉద్యోగులు చేసే పని ఎంతో కీలకమైందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైఫరీత్యాలు, మానవ తప్పిదాల వలన విపత్తులు సంభవించినపుడు ఎలా స్పందించాలనేదానిపై ఎన్‌డిఆర్‌ఎఫ్ టీమ్ ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పలురకాల విపత్తులపై మాక్ డ్రిల్ ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులకు ప్రజలకు యువతకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అధిక వర్షాలతో జిల్లాలోఎలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

గజ ఆతగాళ్లకు సంబంధించిన వివరాలను మున్సిపల్ కమీషనర్ ఆయా తహశీల్దార్‌లు, ఎంపిడిఓలకు అందజేయాలన్నారు. ప్రమాదాలు విపత్తులు జరిగినప్పుడు సాధరణ పౌరులు తమ వంతు భాధ్యతగా తక్షణమే స్పందించాలని, పోలీస్ అగ్నిమాపక శాఖలకు సమాధానం అందించాలన్నారు. ఎంత త్వరగా స్పందిస్తే అంత ఎక్కువగా ప్రాణ ఆస్తి నష్టాలను నివారించవచ్చన్నారు. అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ గతంలో జిల్లాలో జరిగిన పలు అనుభవాలను దృస్టిలో పెట్టుకొని జిల్లాలో ఎక్కువగా సంభవించే వైఫరీత్యాలను ఎదుర్కోవడానికి స్థానికంగా ఏం చేయాలన్నది ప్రణాళికతతో ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలు, భారీ వర్షాలు ప్యాక్టరీలలో కెమికల్ ప్రమాదాలు జరిగనపుడు వారి సహకారంతో ప్రజలను కాపాడాలన్నారు. జరగబోయే ప్రమాదాల గురించి ప్రజలను అప్రమత్తం చేయాలని,15రోజుల పాటు విపత్తులు సంభవించినపుడు కాపాడుకోవడంపై నిర్వహించే ఆయా కార్యక్రమాలు అందరి సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నగేష్, ఎన్‌డిఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ విజయవాడ ఇన్‌స్పెక్టర్ ముఖేష్‌కుమార్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News