Thursday, January 23, 2025

తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల పాత్ర మరువలేనిది

- Advertisement -
- Advertisement -

కరీంనగర్:తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత పాటదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్ ఆదివారం సీతారాంపూర్ పీఎం కన్వెన్షన్‌లో తెలంగాణ డ్యాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్యాన్స్ స్పోర్ట్ వర్క్‌షాప్ ప్రిపరేషన్ మీటింగ్‌ను చేపట్టారు.

ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా నగర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కళాకారులతో కలిసి తెలంగాణ డ్యాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ కరీంనగర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం డ్యాన్స్‌ను కళగా కాకుండా క్రీడగా గుర్తించిందని డ్యాన్స్ స్పోర్ట్ తెలంగాణ ప్రభుత్వం సైతం సంపూర్ణ మద్దతునందిస్తుందన్నారు.

ఇందుకోసం కరీంనగర్‌లో డ్యాన్స్ అకాడమీ బిల్డింగ్‌ను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. నేను కళాకారున్ని కాకపోయినా కళలను పోషించడం నా నైజామన్నారు. ఇందుకోసం ఇప్పటికే కరీంనగర్ వేదికగా కళోత్సవాలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కట్ట రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, సోమరాజు, వంగల శ్రీధర్, ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, లింగంపల్లి నాగరాజు, గసికంటి జనార్థన్‌రెడ్డి, మెతుకు హేమలత పటేల్, కృపానందం, తిప్పరి ప్రభు, శ్రీరామోజు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News