Monday, December 23, 2024

సమాజ నిర్మాణంలో పోలీస్‌ల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : సురక్షితమైన సమాజం నిర్మాణంలో పోలీస్ పాత్ర చాల కీలకమైనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఎస్‌ఆర్‌అండ్‌బి మైదానం వద్ద ఆదివారం సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్లు బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధు ఎంపి నామా నాగేశ్వరావు, ఎంపీ రవిచంద్ర, కలెక్టర్ గౌతమ్ పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి మేయర్ నీరజతో కలసి మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు.

ఎస్ ఆర్ అండ్ బి మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇల్లందు సర్కిల్, ఐటి హబ్, జిల్లా కోర్టు, ఇందిరా నగర్ సర్కిల్, మీదగా చెన్నై షాపింగ్ మాల్, జెడ్పీ సెంటర్, జమ్మి బండ, తుమ్మల గడ్డ, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్ పోలీస్ కమాండ్ కంట్రోల్, బోస్ బొమ్మ సెంటర్, గ్రైన్ మార్కేట్, హర్కర బావి సర్కిల్, గణేష్ గంజ్, గాంధీ చౌక్, పిఎస్‌ఆర్ రోడ్, నయా బజార్, కల్వోడ్డు, జూబ్లీ క్లబ్, మయూరి సెంటర్ మీదగా పాత బస్ స్టాండ్ వరకు భారీ పోలీస్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం పాత బస్‌స్టాండు వద్ద జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు అధ్బుతంగా ఉన్నయంటే పోలీస్ యంత్రాంగం పడిన కష్టానికి ఫలితమని అన్నారు.

రాత్రిపగలు తేడా లేకుండా ఆహర్నశలు కష్టపడి సమర్ధవంతమైన సేవలందిచడం ద్వారానే ప్రజలు నిర్భయంగా జీవన విధానాన్ని కొనసాగే పరిస్థితికి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక పోలీస్ సంస్కరణల ద్వారా అరచక శక్తులను అణచివేతతో గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ఎక్కడ చిన్న సంఘటనలు జరగలేదన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు పోలీస్ కమిషనరేట్ గా తీర్చిదిద్దటంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు గౌరవించే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సిఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టడంతోనే నేడు రాష్ట్ర భద్రత అద్భుతంగా ఉందన్నారు.

తెలంగాణ పోలీస్ వ్యవస్థ యావత్ దేశంలోనే అత్యంత పటిష్టంగా ఉండడంతో పాటు శాంతి భద్రతలను కాపాడడంలో అగ్రగామిగా ఉందని బిఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని అత్యాధునికరించారన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో పోలీసుల పాత్ర కూడా గణనీయంగా ఉందన్నారు. కానిస్టేబుల్ కృష్ణయ్య బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మరింత స్పూర్తితో ముందుకు నడిపించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ సేవ అనేది ప్రముఖమైందన్నారు. స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థకు చిరునామాగా మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ నిలిచిందన్నారు.

ఖమ్మం ప్రజానీకానికి నిస్వార్ధమైన సేవలను అందించడంలో ఖమ్మం పోలీస్ ముందుందన్నారు. తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉండడం, ముందుకు సాగడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతుండడంలో పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారన్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. కేసీఆర్ అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ సుపరిపాలన అందిస్తుండడంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని, ప్రగతిపథాన పరుగులు పెడుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు.

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ ఖమ్మం పోలీస్ శాఖ ర్యాలీకి ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తుంటే పోలీసు వ్యవస్థ ప్రజల్లో ఎంత నమ్మకం పెరిగింది అనేది ఇట్టే అర్థమయిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించు కోవాలన్నారు. ముఖ్యంగా పోలీసు సురక్ష దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్ తోపాటు నగర మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, శిక్షణ కలెక్టర్‌లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్, డిఎఫ్‌ఓ సిదర్ధ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ అత్తలూరి సుభాష్ చంద్ర బోస్, ఎసిపిలు రామోజీ రమేష్, గణేష్, సిఐలు స్వామి, శ్రీధర్, సత్యనారాయణ, అంజలి, శ్రీనివాస్, అశోక్, చిట్టిబాబు, ఎమ్‌టిఓ శ్రీనివాస్, అడ్మిన్ అర్‌ఐలు రవి, తిరుపతి, సింహాచలం సాంబశివ రావు, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News