Wednesday, January 22, 2025

సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకం అని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వీపంచి కళా నియలయంలో నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమంను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఎండ్లు పూర్తి అయినందుకు ఘనంగా స్వతంత్ర ఉత్సవాలను జరుపుకున్నామని గుర్తు చేశారు. జనాభాలో మొదటి స్థానంలో ఉన్న దేశం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని ప్రధాని మోడీ ఆలోచిస్తున్నారని దీనికి నేటి యువత తోడ్పాటు అం దించాలని కోరారు.

కరోనా వచ్చినప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత మన భార తదేశారనికి దక్కిందన్నారు. నాటి నరేంద్రుడి కలలుగన్న భారతదేశాన్ని నేటి నరేంద్రుడి సహకరాం చేస్తున్నాడని అన్నారు. ఒకప్పుడు పాచాత్యదేశాల్లో మనదేశం పేరు చెప్పుకోవడానికి ఆలోచించేవారని ఒలంపిక్ క్రీడలు జరిగితే మన దేశం పేరు వెతికే వాళ్లమని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అన్నింటిలో ముందుకు వెలుతున్నామన్నారు. స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండే వరకు భారతదేశం అన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ తీసుకువెళ్లాలని ప్రదాన మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. అందుకోసం రానున్న 25 ఎండ్లు అమృత కాలంగా భావిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

భారతదేశంలో ఆర్థ్ధిక రంగంలో మోడీ నాయకత్వంలో 5వ స్థానానికి చేరుకుందన్నారు. ప్రభుత్వ విద్యా విధానంలో మార్పు వస్తుంది కావున ప్రభుత్వ పాఠశాలల పట్ల ఎవరికి తక్కువ చూపు ఉండ కూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లయితే ఇంకా తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్య విధానం మీద నమ్మకం కలుగుతుందన్నారు. విద్యార్ధులలో మార్పు తీసుకువచ్చే బాధ్యత ఉపాధ్యాయులదేనని సమాజంలో మార్పు రావాలంటే విద్యార్ధులు ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ప్రపంచం అంతా యోగ విలువను గుర్తించిందని ప్రతి ఒక్కరు ప్రతి రోజు గంట పాటు వ్యాయామం,యోగాకు కేటాయించాలన్నారు. అనంతరం యువ ఉత్సవ్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పైజాన్ ఆహ్మద్, నెహ్రు యువ కేంద్ర సభ్యులు రంజిత్ కుమార్, నాగేందర్ రెడ్డి, సిడిపిఓ రమాదేవి, విభీషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News