Saturday, December 21, 2024

తెలంగాణ ఉద్యమంలో టిఎన్జీఓస్ పాత్ర ఆమోఘం

- Advertisement -
- Advertisement -
  • మంత్రి హరీశ్‌రావును కలిసిన టిఎన్జీఓస్ నాయకులు

సిద్దిపేట: తెలంగాణ ఉద్యమంలో టిఎన్జీఓస్ పాత్ర ఆమోఘమైంది రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో టిఎన్జీఓస్ నాయకులు మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ అలాగే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్ని రంగాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉండడానికి ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. పిఆర్‌సిని అలాగే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పట్ల మంతరి సానుకూలంగా స్పందించారన్నారు.

సిద్దిపేట జిల్లాలో ఉద్యోగులు అందరు కూడా బాగా పని చేస్తున్నారని సిద్దిపేటను అన్నిరంగాల్లో కూడా ముందువరుసలో ఉంచడం ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. తెలంగాణలోనే ఆదర్శ జిల్లాగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, ప్రదాన కార్యదర్శి మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్ రెడ్డి, సహా అద్యక్షుడు సురేందర్‌రెడ్డి, కోశాధికారి ఆశ్వాక్, ఆహ్మద్, టిఎన్జీఓస్ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు, యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News