Monday, December 23, 2024

ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

బజార్హత్నూర్ : కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి ్ద చెందాలంటే మహిళల పాత్ర కీలకమని తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ వృత్తి నైపుణ్య శాఖ అధికారి ప్రశాంత్ తెలిపారు. బుధవారం ఇంద్రవెల్లి, ఇచ్చోడ మండలకేంద్రంలోని ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ( పిఎంకెవివై) బ్యూటిషన్ సెంటర్లను పరిశీలించి లబ్ధ్దిదారులతో మాట్లాడారు. బయోమెట్రిక్ చేస్తున్న ప్రక్రియను సంబంధిత టీచర్లను అడిగి తెలుసుకున్నారు.

ఏజెన్సీ ఏరియాలలో ఇటు వంటి శిక్షణలు ఇవ్వడం వలన మహిళలు కుటుంబ పోషణలో భాగ స్వాములు కావచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాం తాలకు మరిన్ని కార్యక్రమాలు అందిస్తుందన్నారు. ఇది వరకు నేర్చుకున్నా అంశాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జన శిక్షణ సంస్థ చైర్మన్ సురేంధర్, జన శిక్షణ సంస్థ జిల్లా డైరెక్టర్ మేదరి శ్యామల, ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజన్న, సంతోష్, టీచర్లు దుర్గ ,ప్రాచీ మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News