Thursday, January 23, 2025

రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

వరంగల్ : త్వరలో జరగబోయే అన్ని ఎ న్నికలలో యువజన కాంగ్రెస్ నాయకుల పాత్ర కీలకమని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్‌రెడ్డితో పాటు టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయ ణ రావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజు ల్లో యువత ముందుండి కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలను అం దరికి చేరేలా ముందుండి నడిపించాలని, అదేవిధంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిలకు పెద్దపీట వేసినటువంటి కాంగ్రెస్‌ను ఎవరూ మరువద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యువ త నడుం బిగించి ముందుకు సాగాలన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలని జిఎస్‌ఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయుకలు, పలు మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News