Monday, December 23, 2024

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతిక గులాబీ జెండా

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకర్‌పల్లి: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ ప్రతీక గులాబీ జెండా అని చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శంకర్ పల్లి మండలంలోని మోకిలా గ్రామ బిఆర్ ఎస్ అధ్యక్షుడిగా గోపాల్‌చారి ఎన్నికైన సందర్భంగా ఆదివారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కొండకల్ క్రాస్ రోడ్డులో టిఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా మూడోసారి బిఆర్ ఎస్‌పార్టీ అధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని కొనియాడారు.

కార్యకర్తలు గ్రామాలలో బిఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ రాజు నాయక్, శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ ఎస్. ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రమౌళి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, చేకూర్త గోపాల్ రెడ్డి, మోకిల మాజీ సర్పంచ్ ఆనంద్, మాజీ ఎంపిటిసి యాదయ్య మండల బిసి సెల్ అధ్యక్షుడు మన్నె లింగం ముదిరాజ్, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి.ఫరీద్, నాయకులు రవీందర్ రెడ్డి, అ క్కు సాబు, రామస్వామి, అంజయ్య, హనుమంత్ రెడ్డి, సంగారెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎం. వెంకటేష్,.కె. యాదయ్య, కళాకారుడు సంజీవ, శివ నాయక్, గ్రామ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు రియాజ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News