Friday, November 22, 2024

ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు వైఫలం

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చేందుకు కేంద్రం కుట్ర
వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేయాలి
ఎన్‌పిఆర్‌డి శిక్షణా తరగతుల్లో వక్తలు

మన తెలంగాణ / హైదరాబాద్ : వికాలంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు వైఫల్యం చేందారని అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ విమర్శించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వికాలంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర శిక్షణ తరగతులు ఎస్‌వికెలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎండి అబ్బాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిత్యావసర సరుకుల ధరలు 2014తో పోలిస్తే 200 శాతం పెరిగాయ, కూరగాయల ధరలు 37 శాతం, పప్పుల ధరలు 45 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 40 శాతం మంది ప్రజలకు పౌష్ఠిక ఆహారం లోపంతో బాధపడుతున్నారని మహిళల్లో 57శాతం, పిల్లలో 67 శాతం రక్త హీనత ఉందని అన్నారు.

ఏటా 2 కొట్లా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేందుకు కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు. ప్రజల సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చి వేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య కులం, మతం పేరుతో వైషమ్యాలు సృష్టించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాత్ర లేని బిజెపి ప్రభుత్వంకు తెలంగాణ సాయుధ పోరాటo గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పూయడనికి బిజెపి కుట్రలు చేస్తోందని వాటిని తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యదర్శి ఏం అడివయ్య మాట్లాడుతూ 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 89 ప్రకారం వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనేక సంస్థలకు ఛైర్మెన్లను నియమిస్తూన్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. వికలాంగులకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ పార్టీలన్నీ వికలాంగుల సమస్యలపై డిక్లరేషన్స్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కులాల వారిగా డిక్లరేషన్స్ ప్రకటిస్తున్న రాజకీయా పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో 43.04 లక్షల మంది ఉన్న వికలాంగులు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేయాలని లేనియెడల ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జే రాజు, యశోద, బస్వరాజు, మధుబాబు, సహాయ కార్యదర్శులు ఉపేందర్, దశరథ్, కశప్ప, రాష్ట్ర కమిటి సభ్యులు గోపాల్, రంగారెడ్డి, రాధమ్మ, స్వామి, లింగన్న, జంగయ్య, చంద్రమోహన్, గంగారం, ప్రభు స్వామి, లలిత, లతో పాటు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News