Monday, December 23, 2024

సరిహద్దుల్లో వీర జవానుల త్యాగాలను గుర్తు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

జెండా ఆవిష్కరణలో డోబ్రియాల్

మన తెలంగాణ / హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం వేళ ప్రతీ ఒక్కరూ దేశ సరిహద్దుల్లో వీర జవానుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని, వారి స్ఫూర్తితో అభివృద్ధికి పునరంకితం కావాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్‌లో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. అధికారులు, సిబ్బంది సమక్షంలో డోబ్రియాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో పనితీరులో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకాలను అందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News