Monday, January 20, 2025

అమరుల త్యాగాలు చిరస్మరణీయం

- Advertisement -
- Advertisement -

గద్వాల : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం తెలంగాణ అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని స్మృతివనం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా అధనపు కలెక్టర్ అపూర్వచౌహన్, గద్వాల, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, మున్సిపల్ చైర్మన్ బిఎస్. కేశవ్ , గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ శ్రీధర్‌గౌడ్‌లతో కలిసి అమరవీరు ల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. అప్పుడు వారు చేసిన త్యాగాలకు ఫలితంగా తెలంగాణలో వారికి నివాళులర్పించుకుంటున్నామని, నాటి ఉద్యమంలో అ మరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడి నేడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అమరుల ను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. జిల్లా అభివృద్ధి జరగాలంటే మీ అందరి సహకారం ఉండాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ స ంవత్సరంలో ఉన్నందున, 9 సంవత్సరాలు సాధించిన ప్రగతిని జూన్ 2 నుండి గురువారం వరకు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామని, చివరి రోజు అమరుల సంస్మరణ సభ నిర్వహించుకోవడ ం చాలా సంతోషంగా ఉందని , తెలంగాణ ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొని అమరులైన వారిని గుర్తి ంచి వారికి న్యాయం జరగాలని వారి స్మారక చిహ్నాలను ప్రారంభించుకున్నామన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా తెలంగాణ రావాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ఉద్యమానికి పునాది వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్తు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని, తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయి అమరులైనారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు , ఎత్తిపోతల పథకం తెలుసుకువచ్చి 2014లో 14వేల ఎకరాలు ఉంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.30 వేల ఎకరాలకు నీటి సౌకర్యం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వందేనని, వ్యవసాయ రంగం ఆర్ధికంగా అభివృద్ధి చెందిందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ గతంలో 54 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరిగిందని, తెలంగాణ కొరకు 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు అర్పించి అమరులయ్యారని, వారిని ఈ సందర్భ ంగా స్మరించుకోవటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ నర్సిములు, శ్యాం ప్రసాద్‌రెడ్డి, వెంకటరంగారెడ్డి, రమేష్, మోహన్‌రావు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News