బోధన్: అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని బోధన్ ఎంపిపి బుద్దే సావిత్రి రాజేశ్వర్, బోధన్ ఎఎంసి ఛైర్మన్ విఆర్ దేశాయ్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బోధన్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపిపి ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి చిత్రపటానికి వారు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిముషాలు మౌనంపాటించారు.
అనంతరం అమరవీరుల సంస్మరణ ప్ర త్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమ ంలో మాజీ రైసస కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్ మాట్లాడారు. సమావేశంలో ఎఎంసి వైస్ ఛైర్మన్ సాలూరా షకీల్, ఎంపిడిఓ పర్బన్న, ఎంపిఓ మధుకర్, సూపరిండెంట్ శ్రీనివాస్, ఎఎంసి కార్యదర్శి పూర్యానాయక్, నోడల్ అధికారి నాగయ్య, పార్టీ మండలప్రధాన కార్యదర్శి సిర్ప సుదర్శన్, సర్పంచ్‌లు, ఎంపీటిసీలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.