Monday, December 23, 2024

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం హుజురాబాద్ నియోజకవర్గంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో అమరుల ఆశయం, స్వపరిపాలన లక్షాన్ని సాధించడమే కాదని, సుపరిపాలన ఫలాలను సమస్త సమాజానికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News