Monday, December 23, 2024

అమరుల త్యాగాలు మరువలేనివి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని, ముఖ్యమంత్రి ప్రతి కార్యక్రమం అమరులను తలచుకునే మొదలుపెడతారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, సంస్మరణ తీర్మానం చేయుటకు జిల్లా ప్రజా పరిషత్ అద్యక్షురాలు హేమలతశేఖర్‌గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో వెల్దుర్తి జడ్పిటిసి రమేష్‌గౌడ్ అమరుల సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టగా నర్సాపూర్ జడ్పిటిసి బబ్యానాయక్ బలపరచగా సభ ఆమోదించింది. ఈ సందర్భంగా అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

అనంతరం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 12 మంది అమరుల కుటుంబాలను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వచ్చుడో-సచ్చుడో నినాదంతో అహింసా మార్గంలో ముఖ్యమంత్రి 2009లో చావు చివరిదాకా వెళ్లి వచ్చారని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ఇస్తదో, ఇవ్వదో అని విద్యార్థులు బావోద్వేగానికి గురై మేము పోతే ఒత్తిడి పెరిగి కేంద్రం తలొగ్గి రాష్ట్రం ఇస్తదని, తమ పిల్లలు, భవిష్యత్తుతరాలు బాగుపడతాయని ప్రాణత్యాగం చేశారని, శ్రీకాంతచారివంటి ఎందరో విద్యార్థులు అసువులుబాసారని అన్నారు. అదేవిధంగా తెలంగాణ తొలిదశ, మలిదశలో అన్ని వర్గాలవారు ధర్నాలు, రాస్తారోకోలు, వివిధ రీతుల్లో నిరసనలుచేశారని గుర్తు చేశారు.

ఏ ఆశయ సాధన కోసం బలిదానాలు చేశారో ఆ దిశగా ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తూ దేశంలోని 29 రాష్ట్రాలలో అన్ని రంగాలందరూ అగ్రగామిగా నిలుస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలనే ముఖ్యమంత్రి నేడు సచివాలయానికి సమీపంలో స్మృతిజ్యోతివెలిగిస్తున్నారని, వారిత్యాగాలు ఆత్మాజ్యోతి రూపంలో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం అసువులుబాసిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. కుటుంబాలను త్యాగం చేస్తూ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అసువులు బాసిన అమరుల మనోసంకల్పం గొప్పదని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ పోరాటంలో ఆశించిన లక్షాలు నెరవేర్చడంతోపాటు విభిన్న రంగాల్లో పురోగతిని సాదించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పి రోహిణి ప్రియదర్శిని,అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్, జిల్లా పరిషత్ సిఈఓ వెంకటశైలేష్, జడ్పిటిసిలు, ఎంపిపిలు, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News