నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు సందర్భంగా గురువారం అమరవీరులకు నివాళలర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వరంగల్ రోడ్డు కూడలిలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పుష్పాంజలి ఘటించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం కోసం తొలి దశ నుంచి మలి ద వరకు ఆత్మగౌరవ బావుట కోసం ప్రాణాలర్పించిన ఎందరో త్యాగదనుల స్ఫూర్తిని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్, వైస్ ఛైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, నియోజకవర్గ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మ, దేవోజు తిరుమల, గందె రజిత, జర్రు రాజు, శీలం రాంబాబు, రామసాయం శ్రీదేవి, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, గోనె యువరాజు, కోఆప్షన్ సభ్యులు నాయిని సునీత, యాకుబ్‌మియా, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, క్లస్టర్ బాధ్యులు, పట్టణ ప్రముఖులు, మహిళా సమాఖ్య సభ్యులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.