Friday, December 20, 2024

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలే కీలకం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్‌నగర్: ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని షాద్‌నగర్ శాసన సభ్యులు వై.అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.

అమరవీరులు నివాళ్ళు అర్పించడంతోపాటు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటన తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవడంతోపాటు ఎంతో అభివృద్ది సాధించినట్లు గుర్తు చేశారు.

గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాలలో అనేక మౌళిక సౌకర్యాలు కల్పించినట్లు గుర్తు చేశారు. మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు సేవలందిస్తున్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు, వైకుంఠధామాలు, చెత్త డంపింగ్ యార్డులు వంటి అభివృద్ది పనులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు..వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందనే విషయాలను ప్రజలందరు గమనించాలని కోరారు. ఎస్సీ, ఎస్టి, మైనార్టీ, బిసి విద్యార్ధుల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని గుర్తు చేశారు. అభివృద్ది, సంక్షేమానికి ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

అదే విధంగా షాద్‌నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఫుడ్ కోర్టును ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ నరేందర్, వైస్ చైర్మెన్ నటరాజన్, కమీషనర్ వెంకన్న, కౌన్సిలర్లు చెట్ల పావని నర్సింలు, జూపల్లి కౌసల్య శంకర్, ఈశ్వర్‌రాజు, కానుగు అనంతయ్య, ప్రతాప్‌రెడ్డి, ఈగ వెంకట్‌రాంరెడ్డితోపాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News