ఆసిఫాబాద్: రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరవలేనివని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం తెలంగాణ అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కారించుకొ ని జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, ఎస్పీ సురేష్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు అత్రం సక్కు, కోనేరు కోనప్పలతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళ్లు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. నాటి ఉద్యమంలో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేడు స్వరాష్ట్ర ఫలాలు మనం అనుభవిస్తు న్నామని అన్నారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పివైస్‌చైర్మన్ కోనేరు కృష్ణారావు, సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.