Sunday, January 19, 2025

ఎల్బీనగర్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయం

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : కాషాయ జెండా ఎల్బీనగర్‌లో ఎగరవేసి ,రాష్ట్రంలో బిజెపి అధికారంలో రావడం ఖాయమని మాజీ బిసీ కమిషన్ మెంబర్ త ల్లో జు ఆచారి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ 7 సం యుక్త మోర్చాల సమావేశం కుషాల్ ఫంక్షన్ హల్‌లో గురువారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి నేతృత్వంలో ,నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ గౌడ్ అధ్యక్షతన సమావేశానికి ముఖ్యాతిథిగా తల్లోజు ఆచారి హజరై మాట్లాడుతూ.. ఎల్బీనగర్ 11 మంది కార్పొరేటర్లు సీట్లు 11ను గెలిపించుకున్నామని, నియోజకవర్గంలో కార్పొరేటర్లు అ ందరు కలసి ఎల్బీనగర్‌లో కమలపువ్వు గెలిపించాలని ,భాగ్యనగరంలో అన్ని సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మహిళ మోర్చా రాష్ట్రంలో ఎక్క డ లేని విధంగా ఇక్కడ పని చేస్తుందని ,ప్రతి మోర్చా బలోపేతం చేయాలని ,10 వేల మంది మహిళ మో ర్చా ఎల్బీనగర్‌లో సమావేశం నిర్వహించాలని సూచి ంచారు. దేశంలో 60 కోట్ల మందికి రేషన్ బియ్యం ప్ర ధాని మంత్రి నరేంద్ర మోడీ పంపిణీ చేస్తున్నారని ,దే శంలో ఆయుష్మాన్ భారత్‌తో ఎంతో మందికి లబ్ధ్ది చేకూరుతుందని ,దుర్మార్గ పాలన అంతం కావలంటే మోర్చాలు కంకణం కట్టుకొని ఎల్బీనగర్‌లో గళం వి ప్పాలని కోరారు. 9 సంవత్సరాల సిఎం కెసిఆర్ పాలనలో ఓక్క ప్రభుత్వ పాఠశాలకు సున్నం వేయాలేదని ,ఆసుపత్రులు బాగా చేయ లేదన్నారు.

ప్రజల సంపద లూటీ చే సిన వారు ఎవ్వరు త ప్పించకోలేరని ,గల్లీ కో సీసాల దుకాణం మాత్రం తెరిచాడని విమర్శించారు. మన రాజ్యం రావాలంటే బిజెపి గెలివాలన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ స భ్యులు రవీందర్‌రెడ్డి ,మధుసూదన్‌రెడ్డి ,శ్రీనివాస్‌రెడ్డి ,కార్పోరేటర్లు రంగా నర్సింహ్మగుప్తా ,కోప్పుల నర్సింహ్మరెడ్డి ,బద్దం ప్రేం మహేశ్వర్‌రెడ్డి ,కళ్లేం నవజీవన్‌రెడ్డి ,పవన్‌కూమార్ ,వేంకటేశ్వర్‌రెడ్డి ,కృష్ణవేణి ,యశ్వపాల్ గౌడ్ ,దశరథ సాగర్ ,నాంపల్లి రామేశ్వర్ ,మ హిళ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News