Tuesday, November 5, 2024

అదే ‘బిఆర్‌ఎస్’ జోరు.. ‘కాంగ్రెస్’ బేజారు..

- Advertisement -
- Advertisement -
  • ఖాళీ అవుతున్న కాంగ్రెస్.. భర్తీ అవుతున్న బిఆర్‌ఎస్
  • బిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్దమవుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు
  • క్యాడర్‌ను కాపాడుకోలేక కాంగ్రెస్ నాయకుల తికమక:ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

మునిపల్లి : బిఆర్‌ఎస్ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు, అందోల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ను చూసి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి, పెద్దలోడి గ్రామాల కాంగ్రెస్‌కి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే అదే బాటలో ఇటీవల మండలంలోని మేళసంగం, పెద్దలోడి గ్రామాలకు చెందిన 200మంది కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్‌లో భారీగా చేరారు.. కాగా వీరే కాదు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బిఆర్‌స్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.. కాంగ్రెస్‌లో ఇచ్చిన వాళ్లకే పదవులు ఇస్తూ.. కొత్త వారికి అవకాశం కల్పించడం లేదని పార్టీపై గుస్సాతో ఉన్నట్లు గుసగుసలు వినవస్తున్నాయి.

ఇదే అదునుగా భావిస్తున్న బిఆర్‌ఎస్ నేతలు అలకబూనుతున్న కాంగ్రెస్ క్యాడర్‌పై కన్నేసింది.. కాగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నాయకులు, కార్యకర్తలపై పార్టీ నేతలు దృష్టి సారించి పార్టీ వీడొద్దని బుజ్జగిస్తున్నా.. వారు వినడం లేదంటా.. అదే అదునుగా భావించిన స్థానిక బిఆర్‌ఎస్ నేతలు ‘బిఆర్‌ఎస్ ఆకర్ష్’ అనే నినాదంతో మండలంలో కాంగ్రెస్ ఖాళీ చేయాలని కంకనం కట్టుకుందేమో.. అందుకే ఒక్కొక్క పల్లె కాదు.. షేర్ ఖాన్.. గ్రామగ్రామాన కాంగ్రెస్ ఖాళీ అవుతూనే వస్తోంది..! అయితే ఇప్పటికే పెద్దలోడి గ్రామంలో 90శాతం కాంగ్రెస్‌కి క్యాడర్ లేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.. అదే బాటలో చీలపల్లి, మేళసంగం గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో చేరడంతో క్యాడర్‌ను కాపాడుకోలేక తికమకపడుతున్నారంటా కాంగ్రెస్సోళ్లు..! బిఆర్‌ఎస్‌లో చేరే కాంగ్రెస్ నాయకులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు.. ఆ జోరుకు.. కాంగ్రెస్ నేతలు భేజారు అవుతున్నారంటా.. ఇదేంది.. ఇంతమంది బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.. మన కాంగ్రెస్‌లో ఒక్కరు కూడా చేరడం లేదని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

అభివృద్ధిని చూసే పార్టీలోకి: అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరుతుండ్రు..నియోజకవర్గంలో నిత్యం అందుబాటులోఉండి కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా.. తానున్నానంటూ భరోసా కల్పిస్తున్న. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కళ్లల్లో పెట్టి చూసుకుంట.. ఎవరై అధైర్య పడొద్దు..నేను ఎల్లప్పుడు మీ అందరికి తోడు .. నీడాగా ఉంట..

చేసిన అభివృద్ధి గెలుపిస్తుంది
బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్
బిఆర్‌ఎస్ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ గ్రామాల్లోచేపట్టిన అభివృద్ధి, అర్హులైన వారందరికి పార్టీలకతీతంగా అందుతున్న సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్‌ను గెలుపిస్తుంది.. కాంగ్రెస్, బిజెపిలు ఎన్ని కుట్రలు చేసినా.. వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరు..వారిపై విస్వాం లేకనే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి.. అందోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ చేసిన అభివృద్ధే గెలుపిస్తోంది..

కాంగ్రెస్, బిజెపిలను ఖాళీ చేస్తాం
బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్
మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్, బిజెపిలకు చెందిన నాయకులు, కార్యకర్తలను బిఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.. అందుకే ఇటీవల పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో చేరారు. మరికొన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పార్టీలోచేరేందుకు సిద్ధంగా ఉన్నారు.. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తా..

క్రాంతికిరణ్ గెలుపే లక్షంగా పని చేస్తాం
బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో క్రాంతికిరణ్ గెలుపే లక్షంగా పని చేస్తాం.. ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాం.. జర్నలిస్టుగా పని చేసి రాజకీయాల్లో వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తున్నారు. వారంలోమూడు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.. అందుకే ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News