Wednesday, January 22, 2025

తిరుమల పవిత్రతను కాపాడాలి

- Advertisement -
- Advertisement -

కొండపై రాజకీయ విమర్శలు సరికాదు
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్
కఠిన నిబంధనలు రూపొందించాలని ఎపి సిఎం, టిటిడికి విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై రాజకీయ విమర్శలు సరికాదన్నారు. ఆదివారం ఆయన ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంపి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రమని అన్నారు. కొందరు వ్యక్తులు కొండపై రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం, రాజకీయ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. భక్తి భావం తొణికిసలాడాల్సిన చోటును రాజకీయాలకు వేదికగా చేసుకోవడం భావ్యం కాదన్నారు. తిరుమల కొండ పవిత్రతను కాపాడాలని పిలుపు నిచ్చారు. రాజకీయాలు చేసే వారిని నిరోధించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొండపై రాజకీయాలు చేయకుండా కఠిన నిబంధనలు రూపొందించాలని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఇఒ ధర్మారెడ్డిని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News