Wednesday, December 25, 2024

పసివాడి ప్రాణాన్ని బలిగొన్న స్కూల్ బస్

- Advertisement -
- Advertisement -
  • నిర్లక్ష్యానికి మూల్యం పసివాడి ప్రాణం

భీమదేవరపల్లి: మండలంలోని చంపేపల్లి గ్రామానికి చెందిన దండబోయిన శరత్, మమత దంపతుల చిన్న కుమారుడు శివాన్స్ (3) మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలుడి తల్లి తన పెద్ద కుమారుడిని గట్ల నర్సింగాపూర్ లో గల గుండవరం సత్యవతి శ్రీనివాసరావు మెమోరియల్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల బస్సు చంటయ్య పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న క్రాస్ రోడ్ వద్దకు ప్రతిరోజు తీసుకువెళ్లి పాఠశాల బస్సు ఎక్కించి వచ్చేది.

అదేవిధంగా మంగళవారం కూడా పెద్ద కుమారుడిని చిన్న కుమారుడిని తన వెంట తీసుకుని పెద్ద కుమారుని బస్సు ఎక్కించి తిరిగి వచ్చే క్రమంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల బస్సు ముందు ఉన్న బాలుడిని గమనించకపోవడంతో ముందు చక్రం బాలుడిపై ఎక్కించగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News