Thursday, January 23, 2025

పాఠశాల పరిసరాలు అస్తవ్యస్తం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:పాఠశాల పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, అట్టి సమస్యలను వారం రోజులలో పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం తుంగతుర్తిమండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలికల పాఠశాల, కళాశాల విద్యార్ధినిలు త్రాగునీరు కలుషితం కావడంతో వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విష యం తెలుసుకుని పాఠశాలను సందర్శించి పరిసరాలను కలియ తిరిగి పరిశీలించారు.

ఈ మేరకు పాఠశాలలోని వంట గదులను, తరగతి గదులతో పాటు పరిసరాలను వాటర్ సప్లై ప్రదేశాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్ధినిలు త్రాగటానికి ఆర్వో వాటర్ ప్లాంట్ లేకపోవడంతో కలుషిత మంచినీరు త్రాగి విద్యార్ధినిలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. వెంటనే పాఠశాలలో విద్యార్ధినిలు త్రాగడానికి ఆర్వో వాటర్ ఏ ర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. వర్షకాలం ఉన్నందున విద్యార్ధినిలు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. దోమలు నిల్వ ఉండకుండా పాఠశాల ఆవరణంలో నిలిచిన్న నీటిని మట్టిపోసి చదును చేయాలన్నారు. పాఠశాలలో పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు.

ఇటీవల వర్షాలకు పాఠశాల ఆవరణలో నీరు నిలువడంతో బురదగా మారి ఉండడంతో ప్రిన్సిపాల్‌కు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. విద్యార్ధినిలకు మెను ప్రకారం ఆహారం అందించాలని కోరారు. నాణ్యమైన కూరగాయలను మాత్రమే వాడాలన్నారు. పాఠశాలలో సమస్యలు చాలా ఉన్నాయని వాటిని వారం రోజులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ ఉమారాణి ని హెచ్చరించారు. విద్యార్ధినిలు జేసిని కలిసి తమకు నెలకొన్న సమస్యలను వివరించారు. వాటర్ కలుషితం కావడంతో విద్యార్ధినిలు అస్వస్థతకు గురైనట్లు నీటి శ్యాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాంప్రసాద్, ఎంపిడిఓ భీం సింగ్, ఎంఈఓ బోయిని లింగయ్య, ఆర్‌సిఓ లక్ష్మయ్య, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News