మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ రెడీ
ముఖ్యమంత్రి ఆదేశాలతో కొత్త మార్గాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
నాలుగు కొత్త కారిడార్లలో మెట్రో నెట్‌వర్క్ నిర్మాణానికి సిఎం రేవంత్ ఆమోదం?
మన తెలంగాణ/ హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్‌మ్యాప్ సిద్ధమయ్యింది. సిఎం రేవంత్‌రె డ్డి ఆదేశాలతో అధికారులు ఈ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి భరో సా కల్పిస్తూ హైదరాబాద్ మె ట్రో రైలు ఫేజ్-2 విస్తరణ కోసం ఈ రూట్‌లను ప్రభుత్వం ప్రతిపాదించింది. మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాల ని ఇటీవల అధికారులను ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు సోమవారం ప్రతిపాదనలకు సి ఎంకు సమర్పించగా ఆయన వాటికి ఆమోదం తెలిపినట్లుగా తెలిసింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్లు నగర జనాభాలో పెద్ద వర్గానికి అందడం లేదని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. దీని ప్రకారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ప్ర త్యామ్నాయ మార్గాలకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాలు హైదరాబాద్ నగరంలోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా అవాంతరాలు లేని రవాణా సౌకరాన్ని అందించడానికి ఈ మార్గాలు ప్రయాణికులకు మరింత దోహదపడతాయని అధికారులు తెలిపారు. కొత్తగా రూపొందించిన మెట్రో రైలు కనెక్టివిటీ వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రజలకు ప్రజా రవాణాను అందించవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం, హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జెబిఎస్ స్టేషన్ నుంచి ఎంజిబిఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మూడు కారిడార్లలో 69 కి.మీ మేర సేవలను అందిస్తోంది. ఫేజ్- 2లో మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ టు -జూబ్లీ బస్ స్టేషన్ మధ్య ఎంజిబిఎస్ వరకు మెట్రో రైలు మార్గం చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నారు.
కొత్త మెట్రో రైలు రూట్ మ్యాప్ ఇలా…
కారిడార్ 2 : ఎంజిబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు (5.5 కి.మీ); ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు (1.5 కి.మీ)
కారిడార్ 4 : నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ టు చాంద్రాయణ గుట్ట క్రాస్‌రోడ్డు, మైలార్‌దేవ్‌పల్లి, పి7 రోడ్డు టు శంషాబాద్ ఎయిర్‌పోర్టు. మొత్తం (29 కి.మీలు)
కారిడార్ 4 : మైలార్‌దేవ్‌పల్లి నుంచి ప్రతిపాదించిన హైకోర్టు వరకు రాజేంద్రనగర్ వయా అరాంఘర్ (4 కి.మీలు).
కారిడార్ 5 : రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు (రాయదుర్గం టు నానక్‌రాంగూడ టు విప్రో జంక్షన్‌ల నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు (8.కి.మీ)లు.
కారిడార్ 6 : మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు (14 కి.మీ)లు.
కారిడార్ 7 : ఎల్‌బినగర్‌వనస్థలిపురంహయత్‌నగర్ (8 కి.మీలు)