Friday, November 15, 2024

రెండో దశ ఎంఎంటిఎస్‌తో శివారు ప్రాంతాల్లో అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • బిజెపి రాష్ట్ర నాయకుడు వెంకట్‌రెడ్డి

కీసరః ఘట్‌కేసర్ నుండి యాదగిరిగుట్ట రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రెండో దశతో నగర శివారుల ప్రాంతాలలో గననీయమైన అభివృద్ధ్ది జరుగుతుందని బిజెపి రాష్ట్ర రాయకులు, భోగారం ఎంపిటిసి సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం కీసరలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రెండో దశ ఎంఎంటిఎస్, ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులపై చేసిన ప్రకటనల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.330 కోట్ల రైల్వే నిధులతో రెండో దశ ఎంఎంటిఎస్, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు సమాంతరంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులతో మేడ్చల్ జిల్లాతో పాటు హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో రవాణా సౌకర్యం మెరుగు పడి వాణిజ్య, వ్యాపార రంగాలలో ఎంతో అభివృద్ది జరుగుతుందని వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు రెండో దశ ఎంఎంటిఎస్, ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News