Friday, December 20, 2024

సర్వర్ మొరాయించి స్టాంపుల విక్రయానికి ఆటంకం

- Advertisement -
- Advertisement -

హస్తినాపురం: స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఈనెల 22 నుండి స్టాంపు (బాండు పేపర్ల) పేపర్ల విక్రయానికి ఆన్‌లైన్ పద్ధతి అమలులోకి తెచ్చింది. ప్రతి స్టాంపు వెండర్ స్టాంపు పేపరును విక్రయించే ముందు కొనుగోలుదారు పేరు తండ్రి పేరు చిరునామ ఫోన్ నంబరు, స్టాంపు పేపరుపై ఉన్న కోడ్ నంబరు, ఎందుకోసం కొంటున్నారు అనే వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు స్టాంపు వెండర్లకు కొత్త ఆదేశాలు జారి చేశారు. దీంతో ఇబ్బంది పడ్డ స్టాంపు వెండింగ్ లైసెన్స్ హోల్డర్లు తప్పని పరిస్థితిలో కంప్యూటర్లు కొనుగోలు చేసి ఇంటర్‌నెట్ సౌకర్యం చేసుకొని క్రయవిక్రయాలు జరుపుతూ కొత్త పద్దతికి అలవాటుపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నాం 1.30 వరకు సర్వర్ మొరాయించింది.

దీంతో స్టాంపు వెండర్లు వద్ద క్రయ విక్రయాలు ఆగిపోయాయి. కొనుగోలుదారులకు స్టాంపు పేపర్లు లభించే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సకాలంలో అఫిడవిట్లు తయారు చేసుకోలేక, నోటరీలు చేసుకోలేక, కుల, ఆధాయ ధృవీకరణ పత్రాలకు అఫిడవిట్లు జతచేయలేక పలువురు విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం బాండ్ పేపర్లు దొరకక కొందరు డాక్యుమెంట్లు తయారు చేయించుకోలేకపోయారు. పాత డేట్లతో స్టాంపులు విక్రయించి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా వంద రూపాయల బాండు పేపరును వేల రూపాయలకు అమ్ముకొని తప్పుడు పనులను ఉపయోగించకుండా చెక్ పెట్టిన ఈ ఆన్ లైన్ నమోదు పద్ధతి బాగున్నదని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ సర్వర్ పని చేయనపుడు మాత్రం చాలా అసౌకర్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. సర్వర్ పని చేయనపుడు మాత్రము స్టాంపు పేపర్లు క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ప్రత్యాన్మయ ఏర్పాట్లు చేయవలసిందిగా పలువురు బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే ఈ కొత్త పద్ధతి పట్ల సంబంధిత ఉన్నతాధికారులు పునరాలోచించి సర్వర్ ఎల్లపుడూ సక్రమంగా వచ్చేలా చూడాలని సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనీ, కొనుగోలుదారులకు ఇబ్బంది కల్గకుండా చర్యలు తీసుకోవాలని పలువురు బాదితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని శనివారం మనతెలంగాణ రిపోర్టర్ స్తానిక సబ్ రిజ్టిస్టార్ దృష్టికి తీసుకపోగా తమ శాఖ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోతామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News