Monday, December 23, 2024

ఎర్రబెల్లి ట్రస్టు సేవలు శ్లాఘనీయం

- Advertisement -
- Advertisement -
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : కడుపులు కొట్టడమే తప్ప, మంచితనం కనుచూపు మేరలో కనిపించని ఈ రోజుల్లో నిరుపేదలు, కూలీల కడుపులు నింపే కార్యక్రమం చేపడుతున్న ఎర్రబెల్లి ట్రస్టు సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొనియాడారు. ట్రస్టును విజయవంతంగా నడిపిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉషా దయాకర్ రావు దంపతులను మంత్రి అభినందిం చారు. పాలకుర్తి నియోజకవర్గంలో 70వేలకుపైగా ఉన్న ఉపాధిహామీ కూలీలకు లంచ్‌బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్, సెల్ ఫోన్ వంటి వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా తయారు చేసిన బ్యాగ్‌ల ను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ప్రజల సేవే పరమావధిగా పనిచేస్తూ వినూత్న సేవలందిస్తున్నారని కెటిఆర్ ప్రశంసించారు. ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ, ఉచిత కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ, యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ, కరోనా కష్ట కాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. తాజాగా చేపట్టిన ఉపాధి కూలీలకు లంచ్ బాక్సుల పంపిణీ మానవత్వంతో కూడుకుందని ఆయన కొనియాడారు. కూలీలను చులకనగా చూడకుండా వారికి కూడా ఏదో చేయాలన్న సంకల్పంతో బ్యాగ్‌ల పంపిణీ ఆదర్శంగా, అనుసరణీయంగా ఉందని కెటిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News