Monday, December 16, 2024

కరీంనగర్ సహకార బ్యాంకు సేవలు అభినందనీయం

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట: ఒకరి కోసం అందరు అందరి కోసం ఒకరు అనే సహకార నినాదంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ కరీంనగర్ బ్యాంకు సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం అక్కన్నపేట మండల కట్కూర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థ్ధాపన చేశారు. మాట్లాడుతూ సహకార రంగ బ్యాంకులలో కరీంనగర్ సహకార బ్యాంకు సంఘం సభ్యులు విశేషమైన సేవలు అందిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆండియా అభినందనలు పొంది నూతన ఓరవడితో దూసుకుపోతుందన్నారు.

బ్యాంకు ఖాతాదారులకు వివిధ రకాల రుణాలను అందిస్తూ వ్యవసాయదారులైన సంఘ సభ్యులకు పంట రుణాలు, వ్యవసాయ పనిముట్ల కోసం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, వివిధ రకాలైన యంత్రాల కోసం రుణాలను అందిస్తుందన్నారు. వ్యక్తిగత రుణాలు కూడా అతి తక్కువ వడ్డి రేటుతో అందించడంతో సంఘ సభ్యుల సర్వతో ముఖాభివృద్ధ్దికి బ్యాంకు సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. సాంకేతికంగా కూడా కరీంనగర్ సహాకారం బ్యాంకు చాలా ముందంజలో ఉందని కొనియాడారు.
గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ
అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థ్ధాపన, భూమిపూజ చేశారు. ఈస ందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణాలు చేస్తున్నామన్నారు. కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి చేసి ప్రారంభించుకున్నామన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే రాష్ట్రం సౌభాగ్యంగా ఉంటుందని గ్రామంలో అన్ని మౌలిక వసతులు సిసి రోడ్లు, విధి దీపాలు, డ్రైనేజిలు, రోడ్లు, సామాజిక భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠదామాలు, పల్లె ప్రకృతి వనాలు, చెరువులు కట్టల మరమ్మత్తులు, కుంటల మరమ్మతులు ఇలా చెప్పుకుంటూ పోతే స్వరాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు.

హుస్నాబాద్ నియోజక వర్గంలో రాష్ట్ర స్థ్ధాయిలో కొన్ని గ్రామ పంచాయతీలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాయన్నారు. అవార్డులు రావడానికి అధికారులు, ప్రజల ఆశీర్వాదంతోనే అభివృద్ధ్ది సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడడి, ఎంపిపి మాలోతు లక్ష్మిబిలు నాయక్, జడ్పిటిసి భూక్య మంగ శ్రీనివాస్, సర్పంచ్ జిల్లెల ఆశోక్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ పంజా రాజయ్య, వైస్ చైర్మన్ ముకంద రెడ్డి, సిఈఓ శిలాపురం మధుసూదన్, ఉప సర్పంచ్ బొల్లి శ్రీను, పంచాయతీ కార్యదర్శి మోహన్, వార్డు సభ్యులు కోడముంజ సులోచన బాలరాజు, పుల్లెంగుల రాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News