Monday, November 18, 2024

ఆర్‌ఎంపీల సేవలు వెలకట్టలేనివి

- Advertisement -
- Advertisement -

మక్తల్ : గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలనందిస్తోన్న ఆర్‌ఎంపీ వైద్యుల సేవలు వెలకట్టలేనివని నారాయణపేట అక్షిత హాస్పిటల్ గైనకాలజిస్టు డా.అక్షితారెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్‌లో తాలుకా గ్రామీణ వైద్యసేవకుల సంఘం ఆధ్వర్యంలో ఆర్‌ఎంపీలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్‌ఎంపీ వైద్యులు రోగులకు ప్రథమ చికిత్సను మాత్రమే చేయాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ తమ స్థాయికి మించిన వైద్యం చేయరాదన్నారు. ప్రథమ చికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మెరుగైన వైద్యం కోసం నిపుణులైన డాక్టర్ల వద్దకు రెఫర్ చేయాలన్నారు. గ్రామాల్లో ఆర్‌ఎంపీల సేవలను ప్రభుత్వం గుర్తించి డబుల్ బెడ్‌రూం ఇండ్లతో పాటు 50ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలన్నారు.

ఈ సందర్భంగా డా.అక్షితారెడ్డితో పాటు డా.మణివర్ధన్‌రెడ్డిలను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తాలుకా గ్రామీణ వైద్య సేవకుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్.సిద్రామేశ్వర్, మక్తల్ మండల అధ్యక్షులు కర్ని చక్రధర్, జిల్లా అధ్యక్షులు ఆశప్ప, శంకర్, నర్సన్‌గౌడ్, కృష్ణయ్య, మనోహర్‌లాల్, రుకియాబేగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News