Sunday, December 22, 2024

సిపాయిల సేవలు వెలకట్టలేనివి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి ప్రతినిధి: దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులో పనిచేస్తున్న సిపాయిల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేషపు మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జాతీయ సమైక్యత, సమగ్రతలను కాపాడుతూ దేశ రక్షణ కోసం తమ కుటుంబాలకు దూరంగా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సిపాయిల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని అన్నారు.

పబ్లిక్ సర్వీస్‌లో ఉన్న మనం కూడా దేశం కోసం కొంత సమయం వెచ్చించాలని, అవసరమైతే అదనంగా పనిచేయాలని కోరారు. మన రాజ్యాంగం సమాజంలో 18 ఏళ్లు నిండిన అందరికి సమానంగా ఓటు హక్కు కల్పించిందని, నైతిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లబాయి పటేల్ దార్శనికత వల్ల లభ్యమైన దేవ ఏకీకరణ, దేవ సమగ్రత, భద్రత, ఐకమత్యానికి అంకితమవుతాయని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్డివో సాయన్న, వివిధ కార్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News