Sunday, December 22, 2024

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

- Advertisement -
- Advertisement -

కొడంగల్‌ః లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని కేఎస్‌వి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కొడంగల్ లయన్స్ క్లబ్ 35వ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, నటరాజ్‌లు ముఖ్య అథితుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ముఖ్యంగా అందత్వ నివారణే లక్షంగా ఉచిత కంటి వైద్య పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. క్లబ్ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేయాలని సభ్యులకు సూచించారు.

2023– 24 సంవత్సరానికి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, కార్యాదర్శిగా దాసప్ప యాదవ్, కోషాధికారిగా ఎంపీపీ ముద్దప్పలను సభ్యులు ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వైద్యులను క్లబ్ ఆద్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చెర్మెన్ జగదీశ్వర్‌రెడ్డి, మృత్యుంజయ, శ్రీనివాసులు, రమాదేవిలతో పాటు ఇస్లాలేషన్ కమిటి చెర్మెన్ శివకుమార్, వెంకట్‌రెడ్డి, రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News