Monday, December 23, 2024

పట్టణాల రూపురేఖలు మారాయి

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : తెలంగాణ వచ్చాక పట్టణాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. శుక్రవారం కావేరమ్మ పేట జిపి కమ్యూనిటీ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరం తర్వాత జడ్చర్ల పట్టణం చాలా అభివృద్ది చె ందిందన్నారు.

గతంలో ఒక్క పార్కు కూడా లేదని ప్రస్తుతం 17 పార్కులను అందుబాటులోకి తెచ్చామన్నారు. నల్లకుంట, నల్లచెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చమని, ప్రతి వార్డులో సిసి రోడ్లు, డ్రైనేజీ యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామన్నారు. గతంలో నీళ్లకు కూడా ఆడబిడ్డలు చాలా సిబ్బంది పడ్డారని, మంచినీళ్ల కోసం ట్యాంకర్ల వద్ద బారులు తీరేవారని, నేడు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అందజేసి తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు.

పట్టణమంతా డబల్ లైన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్‌ల అభివృద్ధ్దితో సుందరంగా మారిందన్నారు. మున్సిపాల్టీ త్వరలో నే మరో రూ. 30 కోట్ల నిధులు మంజూరు కానున్నాయన్నారు. జడ్చర్లను గ్రేడ్ వన్ మున్సిపాల్టీగా అప్గ్రేడ్ కానుందని, పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధు లు మంజూరు కానున్నాయని తెలిపారు. అనంత రం మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రూ పాయలు కోటీ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాద య్య, డిసిఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రవీందర్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, పిఏసిఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్, మున్సిపల్ డైరెక్టర్ ప్రీతం, కౌన్సిలర్లు కాటేమోని శంకర్, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, రఘురాములు గౌడ్, ఉమాశంకర్ గౌడ్, రమేష్, లత, జ్యోతి, తెరాసా సీనియర్ నాయకులు పిట్టల మురళి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News