Wednesday, January 22, 2025

పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

నందిగామ: పల్లె ప్రగతితోనే గ్రామాల రూపురేఖలు మారాయని షాద్‌గనర్ ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నందిగామ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించి అన్ని పంచాయతీ కార్యలయాల వద్ద గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేశారు.

ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు జిల్లెల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని ఆయన ప్రజలకు వివరించారు. కేసిఆర్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, అనేక సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించారని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్ అని పేర్కొన్నారు. ఆనంతరం పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలను అందచేశారు.

ఈ కార్యక్రమాలలో దశాబ్ది ఉత్సవాల కోఆర్డినేటర్ వెంకట్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపిపి ప్రియాంక శివశంకర్ గౌడ్, పియసియస్ చైర్మన్లు మంజులరెడ్డి, రాజగోపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, తహసీల్దార్ రెహమాన్, ఎంపిడివో బాల్ రెడ్డి, సర్పంచులు ఉమాదేవి రెడ్డి, చంద్రా రెడ్డి, రాజు నాయక్, రమేష్, పాండు రంగారెడ్డి, మామిళ్ల సంతోష విఠల్, రజనిత వీరేందర్ గౌడ్, కవిత శ్రీనివాస్, చిందం రాములమ్మ, జట్ట కుమార్, నీలమ్మ రాజు, ఎల్లమ్మ, ఎంపిటిసిలు కాట్న లతా శ్రీశైలం, చంద్రపాల్ రెడ్డి, రాజు రాయక్, కళమ్మ, ఆయా శాఖల అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News