Saturday, November 23, 2024

పల్లె ప్రగతితో మారిన పల్లెల రూపురేఖలు

- Advertisement -
- Advertisement -

మేడిపల్లి: సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెల రూపురేఖలు మారాయని వేముల వాడ ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్స వం సందర్భంగా మేడిపల్లి మండలం కొండాపూర్, విలాయతాబాద్, మాచాపూర్ గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమా ల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణనీయమైన మార్పు జరిగిందన్నారు.

తెలంగాణ ఉద్య మంలో సకల జనులందరూ కలిసి పోరాడి కేంద్రాన్ని ఒప్పించి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకుని అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామన్నారు. తెలంగాణ సాధించుకుని పది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ సూచనలతో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామని, దానిలో భాగంగా నేడు పల్లె ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉండేవని ప్రజలు గమనించాలన్నారు.

సాగు నీరు, తా గునీరు, విద్య, వైద్యం, ఉపాధి రవాణా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠ దామాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, పల్లె దవాఖానలు, మన ఊరు మన బడి ఇలా అన్ని రంగా ల్లో పల్లెలు సౌకర్యంగా ఆహ్లాదకరంగా మారుతున్నాయని అన్నారు.

అనంతరం విలాయతాబాద్, మాచాపూర్ గ్రామాల్లో రూ.40 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి వైస్ చైర్మన్ ఒద్దినేని హరిచరణ్‌రావు, ఎంపిపి దొ నకంటి ఉమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదగిరి రమ్య, మండల అధ్యక్షులు క్యాతం సత్తిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News