- Advertisement -
పాట్నా: ఈ సంవత్సరం ఏప్రిల్ 19న జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సీట్ల పంపకంను ప్రకటించింది. దీని ప్రకారం ఆర్ జెడికి 26 సీట్లు, కాంగ్రెస్, వామపక్ష కూటమికి తొమ్మిది సీట్లను కేటాయించారు. ఈ సీట్ల షేరింగ్ ప్రకటనను శుక్రవారం చేశారు. ఆర్ జెడి ప్రధాన కార్యాలయంలో ఇండియా కూటమి సంయుక్త పత్రికా సమావేశాన్ని నిర్వహించింది. బీహార్ లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న తేజస్వీ యాదవ్ 40 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను అదికారికంగా ప్రకటించారు.
బీహార్ లో ఎన్నికలు ఏడు దశలలో జరుగనున్నాయి. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న, రెండవ దశ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ 1న జరుగనున్నాయి.
2024 లోక్ సభ ఎన్నికలు ఏడు దశలలో, ఏప్రిల్ 19 నుంచి జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనున్నది.
- Advertisement -