- Advertisement -
దుబాయ్: ప్రపంచంలో అత్యంత తక్కువ ఎత్తున్న మరుగుజ్జుగా 20 ఏళ్ల వ్యక్తి గుర్తింపబడ్డాడు. అతడి పేరు అఫ్సీన్ ఇస్మాయీల్ ఘదెరజాదేహ్. అతడిప్పుడు ప్రపంచంలోనే అత్యంత మరుగుజ్జు వ్యక్తిగా గిన్నీస్ బుక్ రికార్డుకు ఎక్కాడు. అతడి ఎత్తు 2 అడుగుల 1 అంగుళం. బరువు 6.5 కిలోగ్రాములు. ఇరానీ యువకుడైన అతడు చాలా బలహీనంగా ఉంటాడు. అందువల్ల మొబైల్ వంటి వస్తువును కూడా ఉపయోగించలేడు. అఫ్సీన్ పుట్టినప్పుడు అతడి బరువు కేవలం 700 గ్రాములు మాత్రమే. అతడు ఇరాన్‌లోని పశ్చిమ అజర్‌బేజాన్ ప్రాంతానికి చెందిన బుకాన్ కౌంటీకి చెందినవాడు.
- Advertisement -