Monday, January 20, 2025

ఎట్టకేలకు ప్రారంభమైన సింగరేణి ఎక్స్రెస్ రైలు

- Advertisement -
- Advertisement -

కారేపల్లి: కారేపల్లి మండలంలోని పలు రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణించే సింగరేణి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఎట్టకేలకు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం కొత్తగూడెం రైల్వే స్టేషన్ ద్వారా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు, గాంధీనగరం, కారేపల్లి, గేటు కారేపల్లి స్టేషన్ల ద్వారా ఈ రైలు నడుస్తుంది. కారేపల్లి రైల్వే స్టేషన్‌కు ఉదయం ఏడు గంటలకు చేరుకుంటుంది.

కరోనా సమయంలో ఈ రైలు రద్దు కావడంతో ఈ ప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత కొన్నాళ్లపాటు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు నడిచినా ఇటీవల కాలంలో సిర్పూర్ కాగజ్‌నగర్ వరంగల్ మధ్య రైల్వేలైన్ మరమ్మతులు చేపట్టడంతో కొన్నాళ్లపాటు రైలును రద్దు చేశారు. లైన్ మరమ్మతులు పూర్తి కావడంతో బుధవారం నుండి సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కావడంతో ఈ ప్రాంత ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News