Thursday, January 23, 2025

అతిపెద్ద పరుపుల బహుమతిని ప్రకటించిన ది స్లీప్ కంపెనీ

- Advertisement -
- Advertisement -

ది స్లీప్ కంపెనీ (TSC) స్టోర్‌లలో మీ కలల పరుపును సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. దాదాపు రూ. 25 లక్షల విలువైన 100 ఉచిత పరుపుల బహుమతి ఆ రోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మొదట వచ్చిన వారికి , మొదట ప్రాతిపదికన అందించటం జరుగుతుంది. ఒక దశాబ్దం పాటు సుఖ నిద్ర కోసం మీరు చేయాల్సిందల్లా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్, కోకాపేట్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కార్ఖానాలలో ఉన్న TSC స్టోర్‌కు చేరుకోవడం. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ప్రధాన మెట్రోలలో కంపెనీ సుమారు రూ.1 కోటి విలువైన ఉచిత పరుపులను అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇది జరుగనుంది.

ఇది ఇంత భారీ బహుమతిని ప్రకటించిన భారతదేశపు మొట్టమొదటి మ్యాట్రెస్ బ్రాండ్‌గా TSC నిలిచింది. ఇటీవల భారతదేశంలో తన 100వ కోకో స్టోర్‌ను TSC ప్రారంభించింది. ఈ ఆఫర్‌తో ఈ మైలురాయిని వేడుకగా జరుపుకోనుంది.

స్లీప్ కంపెనీ కోఫౌండర్, ప్రియాంక సలోట్ మాట్లాడుతూ..“ప్రజలు బాగా నిద్రపోవడానికి సహాయ పడాలనే మా మిషన్‌లో భాగంగా భారతదేశం అంతటా హైదరాబాద్‌తో పాటు, ముంబై, చెన్నై మరియు ఢిల్లీలో 100 చొప్పున ఉచిత పరుపులను అందించడం ద్వారా 100వ కోకో స్టోర్ మైలురాయిని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా, మా పేటెంట్ పొందిన స్మార్ట్‌గ్రిడ్ మ్యాట్రెస్‌ని ఇంటికి తీసుకెళ్లే అవకాశాన్ని ప్రజలకు అందించాలనుకుంటున్నాము” అని అన్నారు.

ది స్లీప్ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రిపాల్ చోప్డా మాట్లాడుతూ.. “ఈ బహుమతి హైదరాబాదీలు మా పట్ల చూపుతున్న నమ్మకం మరియు విశ్వాసంకు మాదైన రీతిలో కృతజ్ఞతలు తెలిపే మార్గం. వినూత్నమైన మరియు పేటెంట్ పొందిన స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతతో, మా పరుపులు వ్యక్తులకు లోతైన మరియు కలవరపడని నిద్రను అందిస్తాయి” అని అన్నారు.

ఆసియాలో మొట్టమొదటి మరియు ఏకైక స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీ ప్రదాత ,స్లీప్ కంపెనీ, స్లీపింగ్ మరియు సిట్టింగ్ సొల్యూషన్‌లలో విప్లవాత్మక మార్పులు చేసింది. దేశం లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో ఒకటిగా, పరుపుల పరిశ్రమలో డి2సి మరియు ఓమ్నిచానెల్ విభాగాలు రెండింటినీ పునర్నిర్మించడంలో ముందంజలో ఉంది. 2019లో ప్రియాంక, హర్షిల్ సలోట్‌చే ఏర్పాటు చేయబడిన ఈ కంపెనీ కస్టమర్‌లకు అత్యుత్తమ నిద్ర అనుభవాన్ని అందించాలనే తమ నిబద్ధతకు కట్టుబడి వుంది. సంస్థ తమ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి కేవలం 4.5 సంవత్సరాలలోనే, ది స్లీప్ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2024లో రూ. 500 ఏఆర్ఆర్ ను సాధించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది మరియు రాబోయే 2-3 సంవత్సరాలలో రూ. 1000 కోట్ల మార్కును తాకడానికి సిద్ధంగా ఉంది.

విస్తృత శ్రేణిలో స్మార్ట్ రిక్లైనర్ బెడ్‌లు, దిండ్లు, ఆఫీసు కుర్చీలు & రెక్లైనర్ సోఫాలతో సహా అనేక రకాల ఉత్పత్తులను స్లీప్ కంపెనీ అందిస్తుంది. ఉచిత పరుపును గెలుచుకునే అవకాశాన్ని పొందేందుకు హైదరాబాదీలందరినీ ముందుగా నిర్దేశించిన స్టోర్లను సందర్శించాలని మేము ప్రోత్సహిస్తున్నాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News