Monday, December 23, 2024

సమాజాన్ని నడిపిస్తున్నది నాటి మహా పురాణ ధర్మాచరణమే : వకుళాభరణం

- Advertisement -
- Advertisement -

పురాణాల్లోని సామాజిక తాత్వికత అమూల్యమైనది : సురభి వాణి

మన తెలంగాణ / హైదరాబాద్ : పురాణాల్లోని ఇతిహాసాలు నేటికీ మానవ సమాజం మనుగడకు, ధర్మాచరణకు పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు . అష్టాదశ పురాణాలు శ్రీ మదగ్ని, శ్రీ నారద ,శ్రీ మార్కండేయ, శ్రీ వరాహ, శ్రీవామన, శ్రీ వాయు, శ్రీ విష్ణు, శ్రీ భాగవతం .. ఇలా ఒక్కొక్క పురాణం మానవాళిని రుజువర్తనతో, భక్తితో, నిజాయితీ -నిబద్ధతతో జీవనశైలిని కొనసాగించడానికి దోహదం చేస్తూనే ఉన్నాయని ఆయనన్నారు. ఆదివారం విశ్వసాహితి ఆధ్వర్యంలో డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు సభాధ్యక్షతన ‘నాటి పురాణం – నేటి సమాజం‘ గ్రంథావిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొని గ్రంధాలను ఆవిష్కరించారు. ప్రధాన వక్తగా ఎంఎల్‌సి సురభి వాణీదేవి పాల్గొన్నారు. గ్రంథం ఒక భాగంను సర్వార్ధ సంక్షేమ సమితి అధ్యక్షులు, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు సోదరులు పివి. మనోహర్ రావుకు, రెండవ భాగమును వాడపల్లి రాజ్యలక్ష్మికి అంకితం ఇచ్చారు. కార్యక్రమం స్థానిక నాగోల్ స్నేహపురి కాలనీ శ్రీశ్రీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది. ఈ గ్రంథాల ఆవిష్కరణ – అంకితోత్సవం కార్యక్రమంలో, దేవాలయం చైర్మన్ వారణాసి వంశీ, విద్యావేత్తలు, కవులు రచయితలు ఆచార్య టి .గౌరీశంకర్, డాక్టర్ వై .రమాప్రభ, ఆచార్య కడారి సత్యమూర్తి, వైఎస్‌ఆర్ మూర్తి ,వి. జనార్దన్ రావు, గొల్లపూడి పద్మావతి, తంగిరాల చక్రవర్తి ,దుర్గా ప్రసన్నలు పాల్గొని పసంగించారు.గ్రంధావిష్కరణ సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ మహా పురాణాలలో మనిషిని కేంద్రంగా, ప్రతి అంగంకు సూచికగా ఒక్కో పురాణం ఆవిష్కృతమైందని అన్నారు.

మానవాళి మనుగడలో పురాణాల పాత్ర కీలకమైందన్నారు. ఈ పురాణాలలో సామాజిక అంశాలు మహోన్నతమైనవి పేర్కొన్నారు. ఈ అంశాల ఆచరణ వలననే మానవజాతి గొప్ప జీవన విధానంలో నాగరికంగా జీవించగలుగుతోందన్నారు. ఎంఎల్‌సి సురభి వాణి దేవి మాట్లాడుతూ ఋషులు ,మునులు ఏళ్ల తరబడిగా తపస్సులు చేసి సాధించిన దైవిక బలంతో పురాణాలు రచించారన్నారు. మన పురాణాలన్నీ ధర్మాన్ని బోధించాయని, దైవాన్ని దగ్గర చేశాయని పేర్కొన్నారు. అంతకుముందు శ్రీకృష్ణ గానామృతం పేరిట పద్మావతి బృందం, నైవేలి జ్ఞానాంబాళ్ , పి. వాణి కుమారి, తులజ, ప్రత్యూష ,శారదా సాగరి ,చిలకమర్రి హరిచరణ్, బలరాం తదితర బృందాలు భక్తి గీతాలాపనులు చేశాయి. ఈ కార్యక్రమాల్ని శ్రావణి, విశ్వసాహితి, సమ్మోహన, గాయత్రి, ప్రియ జనని, ఎబిబి.ఎస్‌ఎస్ సంగీత సాహిత్య, సాంస్కృతిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. నేటి ఈ కార్యక్రమాలు దైవికంగా, ఆధ్యాత్మికంగా, భక్తజన సందోహంతో వీనులకు విందుగా, కన్నులకు పండుగగా కొనసాగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News