Sunday, December 22, 2024

బీఆర్‌ఎస్‌హాయంలోనే తాగునీటి సమస్యకు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయం లో పట్టణాలు, పల్లెలకు తాగునీటి సమస్య పరిష్కారం అయిందని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు అన్నారు. ఆదివా రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన మంచినీటి పండుగ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు పట్టణ ప్రజలకు నీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంక్ ఎక్కి నీటి శుద్ధిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు, తాగునీటు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజేక్టులను నిర్మాణం చేపట్టి 2 పంటలకు సాగునీరు, మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందించిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్నకోటి, కమీషనర్ శ్రీనివాస్, డీఈ ప్రభాకర్, మేనేజర్ భూపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు పాతకాల రమేష్, కుతాడి రాజయ్య, ఏఈ చంద్రకళ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News